సిరా న్యూస్, ఆదిలాబాద్
జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
* సీనియార్టీ ఆధారంగా పేషేంట్ కేర్ ఇవ్వాలి
* తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలి
* సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు దర్శనాల మల్లేష్
* రిమ్స్ ఎదుట ధర్నా
జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని , సీనియార్టీ ఆధారంగా పేషేంట్ కేర్ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు దర్శనాల మల్లేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఎదుట బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ లో పని చేస్తున్న కార్మికుల ధర్నా అకారణంగా తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలన్నారు.జీఓ 60 ప్రకారం వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లిం చుట, సీనియారిటీ ఆధారంగా పేషేంట్ కేర్ ఇవ్వాలన్నారు. కృష్ణ కన్‌స్ట్రేషన్ ఏజెన్సీ వారు రిమ్స్‌లో పనిచేస్తున్న సూపర్ వైజర్ ఆర్ .సురేందర్ నెలరోజుల నుండీ ,పేషేంట్ కేర్ దర్శా రాకేష్‌ల ను 6 రోజులు గా విధుల నుండీ తొలగించారన్నారు. అలాగే గత యేడాది కాలం నుండీ మల్లేష్ , రజిత లను తొలగించారని, తొలగించే ముందు వారికీ ఎలాంటి ముందుస్తు నోటీసులు ఇవ్వలేదన్నారు. కార్మిక చట్టాలను పాటించలేదు, వారు గత 12 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఉద్యోగం నుండీ తొలగించడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జీఓ.60 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని యెడల విధులు బహిష్కరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొజ్జ ఆశన్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు , ఎస్.నవీన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీయూఎంహెచ్ ఈయూ రిమ్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శి పెర్క దేవిదాస్, అక్రమ్ రిమ్స్ ఉపాధ్యక్షులు పండుగ పొచ్చన్న, సుమన్ తాయి రిమ్స్ నాయకులు, రమేష్, అరుణ్, కలిల్, రమాకాంత్, కిరణ్, శాంత, సరోజ, సుశీల, సునీత తదితరులు పాల్గొన్నారు.