Goush alam: ట్రైనింగ్‌లో క్రమశిక్షణ తప్పనిసరి : ఎస్పీ గౌష్ ఆలం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
ట్రైనింగ్‌లో క్రమశిక్షణ తప్పనిసరి : ఎస్పీ గౌష్ ఆలం
*  255 మంది కానిస్టేబుళ్ల కు శిక్షణ
*  సమాజంలో పోలీస్‌కు ఉన్నత స్థానం
* శారీరక, మానసికంగా దృఢంగా తయారవ్వాలి

ట్రైనింగ్‌లో క్రమశిక్షణ తప్పనిసరని, పోలీస్ వ్యవస్థ సమాజంలో బాధ్యతాయుత వ్యవస్థ అని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. బుధ‌వారం స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న ఆరు జిల్లాల నుండి వ‌చ్చిన 255 మంది శిక్షణ కానిస్టేబుళ్ల పరిచయ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ స్వీకరిస్తున్న స్టైఫండరి కానిస్టేబుల్ లను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని శిక్షణ కేంద్రాల్లో ఒకే రకమైన శిక్షణ అందిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ద్వారా అత్యంత ఉన్నతమైన సౌకర్యాలను కల్పిస్తూ శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు. 9 నెలల పాటు జరిగే ఈ శిక్షణలో ఇండోర్ ఔట్డోర్ విభాగాలను శిక్షణను అందిస్తారన్నారు. శిక్షణలో భాగంగా ఫిజికల్ ట్రైనింగ్, స్వాడ్ డ్రిల్, ఆమ్స్ డ్రిల్, లాటి డ్రిల్, వెపన్ ట్రైనింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, ఫైరింగ్ ప్రాక్టీస్, యోగ, అదేవిధంగా సి ఆర్ పి సి, ఐ పి సి, ఇన్వెస్టిగేషన్, నేరస్తులు ఉపయోగిస్తున్న నూతన పద్ధతులను నేర్పించడం జరుగుతుందని తెలియజేశారు. సమాజంలో పోలీసులకు ఉన్నత స్థానం కలిగి ఉందని దాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని, ఉద్యోగం నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ తప్పనిసరి అని సూచించారు. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుల్ లకు 13,500/- రూపాయలు స్టయిఫండ్ ను అందిస్తున్నట్లు తెలియజేశారు. పోలీసు ఉద్యోగం అనేది ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమని తెలియజేశారు. అదేవిధంగా శిక్షణ సమయంలో ఏకాగ్రతతో ఉంటూ ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సమాజంలో నేరాలను తగ్గుముఖం చేయడమే ప్రధాన కర్తవ్యం గా విధుల నిర్వర్తించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు, ఆర్థిక నేరగాళ్లు, సంఘవిద్రోహశక్తులు, వివిధ రకాలైన నేరగాలతో ఉద్యోగం నిర్వహించవలసి వస్తుందని దీనికి దీటుగా శారీరకం, మానసికంగా దృఢంగా తయారవ్వాలని సూచించారు. ఉద్యోగంలో ప్రతి ఒక్క సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ నూతన నేరాలను కనుగొంటూ, వాటిని చేదించే దిశగా శిక్షణను అందించనున్నట్లు తెలియజేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా తన శిక్షణ సమయంలో తెలుసుకున్న విషయాలను శిక్షణ కానిస్టేబుల్ కు తెలియజేశారు. ఎటువంటి అత్యవసర సమయంలోనైనా పోలీసులు ముందుండి సమాజానికి దారి చూపించే విధంగా వ్యవహరించాలని సూచించారు. తదుపరి శిక్షణ కేంద్రంలో తిరిగి కానిస్టేబుల్ లకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సి సమైజాన్ రావు, డిఎస్పి బి ప్రకాష్, సీఐ ఎన్ ఎస్ ప్రసాద్ , ఆర్ఐ డి కార్తీక్, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *