సిరా న్యూస్,ఏలూరు
నూజివీడు పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై మొక్కజొన్న లోడుతో వెళ్తున్న 12 టైర్ లారీ ఆటోని ఢీకొని పాల సేల్స్ కౌంటర్ పై దూసుకు వచ్చింది. ఘటనలో పాల సేల్స్ కౌంటర్ షెడ్డు రెండు బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. లారీ రాక చూసి అవతల ఖాళీ స్థలంలోకి దూకిన ఇద్దరు వ్యక్తులకు పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న నూజివీడు పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు
=================