విద్యార్దులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

సిరా న్యూస్,నిర్మల్;
నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం ఆనంతరం ఫుడ్ పాయిజన్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ బయటకు వెళ్లిన సమయంలో ఆయనతో మాట్లాడేందుకు విద్యార్థినిల తల్లిదండ్రులు ప్రయత్నించగా కలెక్టర్ నిరాకరించారు. దీంతో విద్యార్థినిల తల్లిదండ్రులు కలెక్టర్ తీరుపై అసనం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *