సిరాన్యూస్,ఆదిలాబాద్
పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
* 15లోగా ఉద్యోగుల వివరాలతో కూడిన దరఖాస్తు సమర్పించాలి
* నోడల్ అధికారులు దరఖాస్తు ఫారం పై సంతకం
* ఆదిలాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఎసెన్షియల్ సర్వీస్(ఏ వి ఈ ఎస్ ) ఉద్యోగులకు ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించినందున ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ తెలిపారు.గురువారం జిల్లా పాలనాధికారి తన ఛాంబర్ లో సంబంధిత నోడల్ అధికారులతో పోస్టల్ బ్యాలెట్ పై సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎసెన్షియల్ సర్వీస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రవాణా సంస్థ, ఆహారం , పౌరసరఫరాల శాఖ, ఎస్ ఎన్ ఎల్, అగ్నిమాపక సేవ ఉద్యోగులు, పోల్ డే కవరేజ్ కోసం ఈసీఐ ద్వారా అధికారం పొందిన మీడియా మిత్రులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే ఎసెన్షియల్ సర్వీస్ ఉద్యోగులు ఫారం 12డి తీసుకొని వాటిని నింపి సంబంధిత శాఖల నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఈ దరఖాస్తులను సంబంధిత శాఖల నోడల్ అధికారులు ఏప్రిల్ 15లోగా సమర్పించాలని అన్నారు. అదిలాబాద్, బోథ్ సెగ్మెంట్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి తిరుమల, జిల్లా వైద్యాధికారి నరేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి హరింద్ర కుమార్, జిల్లా సివిల్ సప్లై కిరణ్ కుమార్, డీఎం సుధారాణి, ఫైర్ ఆఫీసర్ కృష్ణ మూర్తి, జనరల్ మేనేజర్ దేవదాస్, స్టేషన్ మాష్టర్ రైల్వే కుముద్, రీజనల్ మేనేజర్ ఆర్టీసీ కల్పన, తదితరులు పాల్గొన్నారు.