సిరాన్యూస్, ఆదిలాబాద్
జగ్గీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్
బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ శాఖ, బాబు జగ్జీవాన్ రామ్ చౌరస్తాలోని విగ్రహానికి జిల్లా పాలనాధికారి రాజర్షి షా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.