అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్

సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ నియమితులయ్యారు. ఉత్తర్వులు వెలువడ్డ నిన్న సాయంత్రమే జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ బాధ్యతలు చేపట్టారు. అనంతపురం ఎపి ఎస్పీ బెటాలియన్ కమాండెంట్గా అమిత్ బర్దార్ పనిచేస్తున్నారు. అంతకు మునుపు ఆయన సిఐడి ఎస్పీగా పనిచేశారు. 2019 ముందు శ్రీకాకుళం ఎస్పీగా పనిచేశారు. ఇప్పుడు ఆయన్ను అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే నిన్న సాయంత్రం ఆయన ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని నూతన ఎస్పీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *