సిరాన్యూస్, జైనథ్
జైనథ్‌లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
అనగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రం లో బాబు జగ్జీవన్ రామ్ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్ర పటానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా నాయకులు మాట్లాడుతూ అనగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన నడిచిన బాటలో అందరూ నడవాలని కోరారు. కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ సంఘ అధ్యక్షులు అల్ల కొండ నవీన్,స్వామి, జైనథ్ మండల ఎంపీటీసీ. కొడిచెర్ల సుదర్శన్, పిడుగు స్వామీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.