Ravinder Reddy: బీజేపీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండే పార్టీ

సిరాన్యూస్‌, సైదాపూర్
బీజేపీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండే పార్టీ
* కిసాన్ మోర్చా అధ్యక్షులు సందుపట్ల రవీందర్ రెడ్డి
* భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండే పార్టీ అని కిసాన్ మోర్చా అధ్యక్షులు సందుపట్ల రవీందర్ రెడ్డి అన్నారు. శ‌నివారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసంద‌ర్బంగా భ‌రతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండే పార్టీ అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారానే భారత దేశ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అబ్బిడి వీరారెడ్డి , సందుపట్ల రవీందర్ రెడ్డి, దండ తిరుపతి రెడ్డి, ఎడ్ల తిరుపతి, కొంపెల్లి ఆరవింద్ రెడ్డి, తలారి యాదగిరి, ఇరుమల్ల శాంతి స్వరూప్, బుసమల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *