సిరా న్యూస్,మేడ్చల్ జిల్లా;
మేడ్చల్ మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చి వేశారు. శనివారం ఉదయం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారిపై మేడ్చల్ డిపో కి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లను టి పి ఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేశారు. రేకుల షెడ్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసిన మున్సిపల్ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడి మహేందర్ రెడ్డి కి సంబంధించిన షెడ్లని కూల్చివేయడం విశేషం. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి మల్లారెడ్డి కి సంబంధించి అక్రమ నిర్మాణాల కూల్చివేత్తలు జరిగినట్లు సమాచారం
========