సిరాన్యూస్,భీమదేవరపల్లి
ఘనంగా శ్రీ తపాల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలోని శ్రీ తపాల లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.