సిరాన్యూస్, బజార్‌హత్నూర్
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాః ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
* భూతాయి(కె) గ్రామస్తులతో సమావేశం
ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తానని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం లోని భూతాయి(కె) గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా గ్రామస్థులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గత పది సంవత్సరాలలో దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్థులకు వివరించారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి కేంద్రంలో మరోసారి ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వంలో మీ ప్రతినిధిగా తనను పంపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.