సిరాన్యూస్, ఓదెల
చెక్ డాం లతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం..
ఓదెల మానేరు మీద నిర్మించే చెక్ డ్యామ్ లతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఓదెల మండలం మానేరు దగ్గరలో ఉన్న పోత్క పల్లి ఊరు పక్కన ఉన్న మానేరు నదిపై 40 కోట్లతో చెక్ డాం నిర్మాణం పూర్తి అయింది. గత నాలుగు సంవత్సరాల నుండి ఈ చెక్ డాం నిర్మిస్తున్నారు. ఎట్టకేలకు చెక్ డాం పూర్తి అయింది. ఈ చెక్ డాం వలన భూగర్భ జలాలు పెరిగి మానేరు నది పక్కన ఉన్న పొలాలకు పుష్కలంగా సాగునీరు అందుతుందని రైతులు ఆశిస్తున్నారు. నది అవతలి పక్కన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక నది ప్రవాహ ప్రాంతం రైతులు కూడా భూగర్భ జలాలు పెరిగితే రైతులు పండించే పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు నిత్యం సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.