తలసాని
సిరా న్యూస్, సనత్ నగర్;
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతు గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గ సన్నహాక సమావేశాలు ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలు హైదరాబాద్ నగరం నుంచి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు గెలిచారు.అదే ఊపుతో సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవాలి.మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే నియోజవర్గాలకే నిధులు కాకుండా ఎన్ని పార్టీ ల ఎమ్మెల్యేలు నియోజవర్గాలకు కు అభివృద్ధికీ నిధులు కేటాయించారు.కేసీఆర్ అభివృద్ధికి ప్రాదాన్యాత ఇచ్చారు. నగరంలో ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడు తెలియదు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతాడు దానం నాగేందర్. హైదరాబాద్ నగరంలో బలమైన శక్తిగా బి ఆర్ ఎస్ ఉంది.సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ బి ఆర్ ఎస్ గెలిస్తే కేంద్ర కాబినెట్ మంత్రిని ఓడించిన చరిత్ర మనకే దక్కుతుంది. కాంగ్రెస్ చెప్పిన స్కీమ్ లను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ప్రభుత్వం లో ఉన్నప్పుడు కన్నా ప్రతిపక్షంలో ఇంకా బాగా పని చేస్తాం. కార్యకర్తలకు అందరికి అవకాశలు దొరుకుతాయి. మేము కూడా సామాన్య కార్యకర్తలమేనని అన్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరెంట్, మంచినీటి ఇబ్బందులు చాలా ఉన్నాయి .ఆరు గ్యారింటీలును ప్రభుత్వం అమలు చేయలేదు.
ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా కోపంగా ఉన్నారు.కేసీఆర్ జిల్లాలు పర్యటనకు వెళ్ళినప్పుడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత కోపంగా ఉన్నారు తెలుస్తుంది.పద్మారావు గెలుపు కోసం మనం పని చేయాలి గతంలో కేసీఆర్ గారు తీసుకోచ్చిన పధకాలు ప్రజలకు గుర్తు చేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం ప్రజలోకి తీసుకొని వెళ్ళాలి.సనత్ నగర్ చరిత్రలో ఎన్నడు జరగనటువంటి అభివృధి జరిగింది.మనమనందరం సైనికులుగా పని చేసి పద్మారావు గౌడ్ గెలుపు కోసం పని చేయాలి. రకాలరకలాగా ప్రచారాలు జరుగుతాయి వాటిని పట్టించుకోవద్దు, ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటివి సహజమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు హేమలత, టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
=====================