రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి.

కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదు

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పాలి.

రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుంది..

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలి.

కోదాడ మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

 సిరా న్యూస్,సూర్యాపేట;
సాగు నీరు అందక పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.25 వేల పరిహారం వెంటనే అందించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగి పంటలకు క్వింటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోదాడ మాజీ శాసనసభ్యులు , బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు కోదాడ నియోజకవర్గ స్థాయి రైతు భరోసా నిరసన దీక్షను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని సేకరించిన రాష్ట్రం గా తీర్చిదిద్దిన ఘనత కెసిఆర్ దేనని అలాంటిది ఇప్పుడు రైతాంగం నీళ్లు లేక నష్టపోతున్నారు అని ప్రభుత్వం పై మండిపడ్డారు.మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్న మన తెలిపారు.రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి,2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు 15 వేలు, వడ్లకు పండిన పంటపై 500 బోనస్, రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతుల 15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు ఎద్దేవా చేశారు.కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ వచ్చింది, కరువొచ్చిందని ఆయన అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పాలి.రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుంది.రైతులు ధైర్యంగా ఉండాలి. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు అండగా మేముంటాం అన్నారు.వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఏ మంత్రీ పరామర్శించడం లేదని అన్నారు.ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదని తెలిపారు.కరెంటు లేదు, నీళ్లు లేవు.రాబోయే ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థాయిల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *