సిరాన్యూస్, ఆదిలాబాద్
బల్మూరి వెంకట్ ను కలిసిన డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు
భారతదేశంలోని అతిపిన్న వయస్సులో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు గా నియమించబడిన డాక్టర్ బల్మూరి వెంకట్ ను హిమాయత్ నగర్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చలర్ల సంఘం రాష్ట్ర నాయకులు కలిశారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ గెస్ట్ లెక్చలర్ల సమస్యలు డిమాండ్లను కులంకషంగా వివరించారు. అలాగే ఈనెల 13న డిగ్రీ గెస్ట్ లెక్చలర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అతిథులుగా పాల్గొనాలని విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డా.కొర్ర ఈశ్వర్ లాల్, కోఆర్డినేటర్ లు నాగేశ్వరరావు ,బుచ్చి పాల్ రెడ్డి , స్టేట్ సెక్రటరీ జనరల్ గణేష్, జనరల్ సెక్రెటరీ డా.భగ్గు నాయక్ ,ట్రెజరర్ నరేష్, కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.