సిరా న్యూస్, ఆదిలాబాద్
జోగురామన్నను కలిసిన మాజీ ఎమ్మెల్యే నోముల భరత్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి జోగురామన్న ను తన నివాసంలో నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన సోదరితో కలిసి వచ్చారు. మాజీ మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు వారికి స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును కలిసి అభినందనలు తెలియచేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సన్నద్దత, ఇతరత్రా అంశాలపై ఇరువురు చర్చించారు. పట్టణాధ్యక్షుడు అజయ్, నర్సాగౌడ్ ఉన్నారు.