సిరాన్యూస్, చిగురుమామిడి
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
ప్రత్యేక అధికారి వినయ్ సాయి
గ్రామపంచాయతీ నిధులతో రెండు బోర్లు మంజూరు
చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ప్రత్యేక అధికారి వినయ్ సాయి తెలిపారు.సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రమణారెడ్డి అధ్యక్షతన గ్రామసభ సమావేశం నిర్వహించారు.ప్రధానంగా తాగునీటి సమస్య మీద చర్చించారు.ప్రధానంగా నీటి సమస్య ఉన్న గ్రామంలోని 10 వ వార్డు లాలయపల్లి, 9వవార్డు రాములపల్లి (పల్లె మీద) రెండు వార్డుల్లో గ్రామపంచాయతీ నిధులతో బోర్లు వేయడానికి తీర్మానించారు. కార్యదర్శి రమణారెడ్డి, ప్రత్యేక అధికారి వినయ్ సాయి బోర్లు మంజూరు కావడానికి ప్రత్యేక చొరవ చూపారు.కొద్దిరోజుల్లో బోర్లు వేసి నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.లాలాయపల్లి, రాములపల్లి 9వ వార్డు ప్రజలు కార్యదర్శి ,ప్రత్యేక అధికారికి ధన్యవాదాలు తెలిపారు.ఏలాంటి తాగునీటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా పనిచేస్తామని తెలిపారు.