Rangaswamy: సమాచారం కోసం అటవీశాఖ అధికారులకు వినతి

సిరాన్యూస్, కుందుర్పి
సమాచారం కోసం అటవీశాఖ అధికారులకు వినతి

డివిజన్ అటవీశాఖ కార్యాలయలో ప్రజలకు అందుబాటులో ఉంచవలసిన అంశాలను సమాచారం తెలుపాలని ఎపి సమాచార హక్కు ఐక్యవేదిక సభ్యులు కార్యాలయం సిబ్బంది అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు ఐక్యవేదిక సభ్యులు కళ్యాణదుర్గం డివిజన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అధికారి స‌మాచార‌ చట్టం కింద దరఖాస్తును ఆ శాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని ఎక్కడెక్కడ బొగ్గలు బట్టి నిర్వహిస్తున్నారని వివరాలు, అలాగే నిర్వాహకులకు ఇచ్చిన పర్మిట్ వివరాలును, కాల్చిన బొగ్గులు మార్కెటింగ్ చేయుటకు మీరిచ్చే పర్మిట్లను, ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారుని, ఒక్కొక్క పర్మిట్కు రూ,3,000లం తీసుకుంటున్నట్లు నిర్వాహకులు ద్వారా సమాచారం దాని వివరాలు ఇవ్వాలని కోరుతూ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం నుండి డివిజన్ ఫారెస్ట్ కార్యాలయానికి మంజూరైన నిధులు, వాటిని ఖర్చుపెట్టిన వివరాలు, మిగులు వివరాలను ఇవ్వాల‌ని అధికారులను కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కోరారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ అందుబాటులో లేకపోగా , హరిత సభ్యులు చరవాణిలో మాట్లాడి ఆర్టీఐ దరఖాస్తును సిబ్బంది అధీకారికి అందజేసారు. కార్యక్రమంలో స.హ. చట్టం సభ్యులు, బి, రంగస్వామి, బి, కోదండరాములు, జి,ఎం, మంజునాథ, ఎస్ ,మున్నావాస్లు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *