సిరాన్యూస్, బోథ్
పార్టీకేలో రాంజీ గోండు వర్ధంతి
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పార్టీకే గ్రామంలో ఆదివాసీల పోరు బిడ్డ రాంజీ గోండు వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రాంజీ గోండు కు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ దేవారి మహాజన్ గ్రామ జెండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నివాళులర్పించారు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాటం చేసి 1000 మందితో సహా రాంజీ గోండు కూడా అమరుడు కావడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఒక వంద 67 సంవత్సరాల క్రితం అసువులు బాసిన రాంజీ గోండు ఆదర్శ నీయుడని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ అమృతరావ్, దేవరి జయతు, నాయకులు మిశ్రం భూమన్న, మదన్, అనిల్, జైతు, దశరథ్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు