సిరాన్యూస్, ఆదిలాబాద్
జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయండి
* మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
ప్రముఖ సంఘసంస్కర్త, సామాజిక ఉద్యమ పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా ఫులే 197వ జయంతి కార్యక్రమాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలి , బహుజన కులాల వాళ్లంతా కలిసి జయంతి వేడుకలను జరుపుకొని ఆ మహనీయుని ఆశయసాధనకు కృషి చేయాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల ఫూలే విశ్రాంతి భవనంలో ఆయన మాట్లాడుతూ జ్యోతిబాపూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో తన భార్య సావిత్రిబాయి పూలే తో మొదటి స్త్రీల పాఠశాలను ప్రారంభింప చేసి స్త్రీ విద్య కోసం, సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటాలు సాగించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబాపూలే అని ఆయన సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫులే దంపతులకు భారతరత్న ప్రకటించాలని కోరారు. 11వ ఉదయం 10 గంటలకి మాలీ మహా సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఫూలే దంపతుల చిత్రపటాలకు, విగ్రహాలకు నివాళులర్పించడం జరుగుతుందని ఆ తర్వాత తలమడుగు మండలంలో ఉదయం 11 గంటలకు జరిగే విగ్రహానికి పుష్కరణ కార్యక్రమంలో మాలీ మహా సంఘం రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారని, అలాగే తాంసి మండల కేంద్రంలో జరిగే ఫూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నాలుగు గంటల 15 నిమిషాలకు మాలి మహా సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని ఆ మహనీయులకు నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు.