సిరాన్యూస్, ఆదిలాబాద్
రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా
గురువారం రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా జిల్లా లోని ముస్లిమ్ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు .పవిత్ర మాసమైన రంజాన్ లో నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాను ప్రార్థించి ఆధ్యాత్మిక జీవనం కొనసాగించారని తెలిపారు.నెలవంక తో రంజాన్ దీక్షలు ప్రారంభమై మళ్ళీ నెల వంకతో రంజాన్ పండుగ ను జరుపుకుంటారని, ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ముస్లిమ్ సోదరులు, సోదరీమణులు అనందోత్సవలతో, భక్తి శ్రద్ధలతో పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆ అల్లా యొక్క దీవెనలు ఎప్పుడూ మీ పై ఉండాలని ఆకాక్షించారు.