సిరాన్యూస్, తలమడుగు
ఫూలేవిగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయం
* మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే
సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్నిఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లాల్గడ్ గ్రామంలో నెలకొల్పడం అభినందనీయమని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకొని లాల్గుడ గ్రామస్తులంతా కలిసి జ్యోతిబాపూలే విగ్రహాన్ని నెలకొల్పగా ముఖ్యఅతిథిగా వచ్చిన సుకుమార్ పెట్కులే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు వివిధ గ్రామాల కుల పెద్దలు మహాజనులు జ్యోతిబాపూలే విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గ్రామ కుల పెద్ద మహాజన్ అమృత్ గురునులే మాలీ సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాలీ మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గుర్నూలే, కార్యవర్గ సభ్యులు అనిల్ కొట్రంగే, దాసు షెండే, శివాజీ గురునులే ఇస్తారీ నాగోషే, జనార్ధన్ మాందాడే, లచ్చన్న గురుణులే, అశోక్ కొట్రంగే, మధుకర్ షిండే తదితరులు పాల్గొన్నారు.