Sand lorry: ఇసుక లారీల‌ను అడ్డుకున్న గ్రామ‌స్తులు

సిరాన్యూస్‌, బేల‌
ఇసుక లారీల‌ను అడ్డుకున్న గ్రామ‌స్తులు
* వాగులోని ఇసుకను కాపాడాలంటూ రాస్తారోకో

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కొబ్బయి ప్రధాన వాగు లోని ఇసుకను సంబంధిత కాంట్రాక్టర్ తీసుకెళ్లడం పట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు.వాగులోని ఇసుకను అభివృద్ధి పనుల కోసం జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకోని అందులోని ఇసుకను మహారాష్ట్ర నుండి తెలంగాణ అంతరాష్ట్ర రహదారి 353బి నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు వాగు నుండి తరలిస్తున్న ఇసుక లారీలను అడ్డుకున్నారు. లారీలు వెళ్లకుండా ముందర కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంత‌రం గ్రామ‌స్తులు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు తాము అడ్డురాము కానీ ప్రధాన వాగులోని ఇసుకను జేసీబీ ల సహాయంతో తీసుకెళ్లడంతో వాగు పక్కన ఉన్న వ్యవసాయ భూమాలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇచ్చినట్టు వంటి పర్మిషన్ లెటర్ లో కూడా స్పష్టంగా  హైడ్రాలిక్ యంత్రాల‌ను ఉపయోగించి ఇసుకను తీసుకెళ్లారాదు.  అదేవిధంగా కేవలం మట్టిని మాత్రమే తీసుకెళ్లాలని ఉంద‌న్నారు. కానీ ఇవ్వని రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుకను తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో ఇసుకను తీసుకెళ్లడం పిసా 1/70 చట్టానికి విరోద్దాం అని అన్నారు. సంబంధిత అధికారులు వచ్చేంత వరకు వాగు నుండి ఇసుక లారీలను పోనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *