సిద్దిపేటలో ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేటలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇక్బాల్ మినార్ మసీద్ వద్ద ముస్లిం సోదరులను కలసి రంజాన్ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మీ జీవిత అశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోఉపవాసాలు ఉంటారు. ఇంతటి ఓపికతో ఉపవాసాలు చేసిన మీ అందరికీ అల్లా ఆశీర్వాదం ఉంటుంది. మీ ప్రార్థనలు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయి. శాంతికి, ప్రేమకు, పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్. 20ఏండ్లుగా సిద్దిపేటలో రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు అలాయ్ బలాయ్ చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ రోజు కూడా సిద్దిపేట ముస్లిం సోదరులను కలిసి పండగలో పాలుపంచుకున్నందుకుఎంతో సంతోషంగా ఉందని అన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *