సిరాన్యూస్, ఆదిలాబాద్
విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి :డా. సర్ఫరాజ్
కోలాం ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం
విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అంకోలి డా. సర్ఫరాజ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కోలామ్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా చిరు వ్యాధులు కల్గిన ఎలర్జీ, తలనొప్పి, దురద, దెబ్బలు తగిలిన ,సర్ది జలుబు కల్గిన 49 మంది పిల్లలకు మందుగోళీలు ఇచ్చినట్టు డా.సర్ఫరాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంకొలి సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షకులు బొమ్మెత సుభాష్, ఆరోగ్యకార్యకర్తలు నల్ల ఈశ్వర్ రెడ్డి, పవర్ ప్రేమ్ సింగ్,మరప ముయ్యాల మోతి, ఆశా లు చహకటి నర్మద,కె.సూర్య స్కూల్ ఏఎన్ఎం అంజన, స్కూల్ ఇంచార్జి సంతోష్ టీచర్ విద్యార్థులు పాల్గొన్నారు.