సిరాన్యూస్, ఓదెల
శరవేగంగా డబుల్ రోడ్డు నిర్మాణం
ఓదెల మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం కొనసాగుతుంది. గత ప్రభుత్వం 36 కోట్లతో ఓదెల 32 రైల్వే గేటు తారకరామా కాలనీ నుండి కొలనూరు, కొత్తపల్లి, పెద్ద బొంకూరు మీదుగా పెద్దపల్లి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్డు మంజూరు చేసింది. మండల ప్రజలకు ఈ రోడ్డు ద్వారా జిల్లా కేంద్రానికి తక్కువ సమయంలో వెళ్లడానికి అనువైన మార్గం . అయితే ఈ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు పూర్తయితే మండలంలోని వివిధ గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రజలకు ప్రయాణం సుఖమయం అవుతుందని వాహనదారులు అంటున్నారు.