సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఆదిలాబాద్ పట్టణంలోని బార్ అసోసియేషన్ లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు జడ్జి డా. పి శివ రాంప్రసాద్, డిఎల్ఎస్ఎ కార్యదర్శి క్షమా దేశ్పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్, ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్, ఇతర న్యాయవాదులు బార్ అసోసియేషన్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని, ముందుకు వెళ్లాలని సూచించారు.