సిరాన్యూస్,ఓదెల
ఉపాధి కరువై… బతుకు బరువై…
* రంగులతో ఉపాధి వేట..
* ప్రపంచ కళా దినోత్సవం…
మదిలో భావాలకు కుంచే తో రంగులు అద్ది అందమైన రూపం ఇచ్చేదే కళ క్షణాల్లో మనిషిని నిలబెట్టి చిత్రాన్ని గీసే కళాకారులకు కొదవలేదు. తెలంగాణలో అలాంటి కళాకారులకు ఉపాధి కరువవుతుంది . మార్కెట్లో కొత్తగా వచ్చిన ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్లతో బ్యానర్లు తయారు చేస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగితే చేతిరాత అంత తగ్గుతూ వచ్చింది కుంచె పట్టే కళాకారులకు ఉపాధి కరువైంది ఆర్థిక ఇబ్బందులతో సతమత మయ్యే చిత్ర కళాకారులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఫ్లెక్సీ బ్యానర్లు కాకుండా వాల్ పెయింటింగ్ కు అవకాశం ఇచ్చినట్లయితే చిత్ర కళాకారులకు ఉపాధి దొరుకుతుందని చిత్ర కళాకారులు ఆశిస్తున్నారు. ఫ్లెక్సీ బ్యానర్ల ద్వారా పర్యావరణనికి ముప్పే తప్ప ఉపయోగం లేకుండా పోయింది. నూతన ప్రభుత్వంలో ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చిత్ర కళాకారులకు సంక్షేమ పథకాల ద్వారా వాల్ పెయింటింగ్ చిత్ర కళాకారులకు ఉపాధి చూపుతారని జిల్లాలో ఉన్న చిత్ర కళాకారులు కోరుకుంటున్నారు.