Anju Kumar Reddy: ఆదిలాబాద్ ఎంపీని నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇద్దాం

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఆదిలాబాద్ ఎంపీని నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇద్దాం
బీజేపీ జిల్లా అధ్యక్షులు కూనింటి అంజుకుమార్ రెడ్డి
* ఖానాపూర్ పట్టణంలో బూత్ విజయ్ అభియాన్

పార్లమెంట్ ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంట్ సీటు ను నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షులు కూనింటీ అంజు కుమార్ రెడ్డి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.మంగళ వారం ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.ఖానాపూర్ పట్టణంలోని ఇంద్ర నగర్ లోని 235 బూత్ లో బీజేపీ ఇంటింటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, ఓటర్లను చైతన్య పరిచారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి,బీజేపీ అభ్యర్థి నగేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.అనంతరం అంజుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్ర నగర్ కు చెందిన మాజీ వార్డ్ సభ్యురాలు ముత్యపు రాధ ఆధ్వర్యంలో 50 మంది బీజేపీలో చేరారు.బూత్ కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీరాం నగర్ లోని రామాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో పట్టణ బీజేపీ శాఖ బూత్ కమిటీల అధ్యక్షులకు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్,పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్, ఖానాపూర్ మాజీ ఎంపిపి ఆకుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్షులు దాసరి శ్రీనివాస్, కొండవేని రమేష్,మహిళ మోర్చ అధ్యక్షులు బొప్పారపు సత్యవతి,మైనారిటీ మోర్చ అధ్యక్షులు రుస్తుం,బీజేపీ సీనియర్ నాయకులు దాదే మల్లయ్య , పొద్దుటూరి గోపాల్ రెడ్డి, ఏనుగందుల రవి, తగిలిపెల్లి జీవన్, ఎలిగేటీ వెంకటేష్,లింభాద్రి, తు ప్ప రమేష్,కమలాకర్ బూత్ కమిటీల అధ్యక్షులు కొండవేణి సంతోష్, సుధాకర్, ఎడ్ల రాజేశ్వర్, అదేపు రంజిత్,సళ్ళ రవి, సాయి. మేకల నర్సయ్య, పరమేశ్వర్ గౌడ్, గట్టు శ్రీనివాస్, గోవర్ధన్ ,కొండ ప్రశాంత్, మునుగురి గంరాజం పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *