Minister ponnam Prabhakar.పొన్నం ప్రభాకర్ ని సన్మానించిన చేనేత కార్మికులు

సిరా న్యూస్, హుస్నాబాద్:

పొన్నం ప్రభాకర్ ని సన్మానించిన చేనేత కార్మికులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చేనేత కార్మికుల సహకారసంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సాయంత్రం కలిశారు. చేనేత రంగాన్ని కాపాడండి – కాటన్ ని ప్రోత్సహించండి, అంటూ మంత్రి పిలుపు ఇవ్వడంతో, కృతజ్ఞతగా నేడు విచ్చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధన్యావాదాలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ని సన్మానించి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి చేనేత కార్మికులకు అండగా ఉన్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *