సిరాన్యూస్, ఆదిలాబాద్
సీఆర్ఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి :డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి
కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఆర్ ఆర్ జయంతి
సీఆర్ఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దివంగత మాజీ మంత్రివర్యులు చిలుకూరి రామచంద్రారెడ్డి జయంతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను మాజీ మున్సిపల్ ఛైర్మన్ దిగంబర్ రావు పాటిల్ , డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి కొనియాడారు. ఆదిలాబాద్ అంటే రాంచంద్రారెడ్డి, సీఆర్ ఆర్ అంటే ఆదిలాబాద్ అనేంతలా ఇక్కడ పేరు తెచ్చుకున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి మన ఆదిలాబాద్ వాసి కావడం మన అదృష్టమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో భారీ సంఖ్యలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.