సిరాన్యూస్, ఖానాపూర్
బోరుకు మరమ్మతులు చేయించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం 4వ వార్డు శ్రీ రామ్ నగర్ కాలనీలోని భీమన్న ఆలయం ఆవరణలో మూడు రోజులుగా బోరు మోటర్ పని చేయడం లేదు. దీంతో తాగునీరు లేక భక్తులు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈవిషయాన్ని స్థానిక కౌన్సిలర్ నాయిని స్రవంతి సంతోష్ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన చైర్మన్ బోరు మోటరుకు మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బందితో మరమ్మతులు చేయించి తాగునీటిని అందించారు . కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు జన్నరపు శంకర్ , మున్సిపాలిటి వాటర్ సప్లై సిబ్బంది కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.