ఒకరు మృతి…పది మందికి గాయాలు
సిరా న్యూస్,పులివెందుల;
పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం రామిరెడ్డి పల్లె లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రామంలో స్వామి వారిని ఊరేగిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి విషాదం నెలకొంది. గురువారం ఉదయం తెల్లవారుజామున సంఘటన జరిగినది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొంత మంది ని మెరుగైనచికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. .
========