సిరా న్యూస్; ఆదిలాబాద్
-1981 ఏప్రిల్ 20 న జరిగిన యధార్థ ఘటన….
-నేడు ఇంద్రాదేవికి పూజలు చేసి అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఆదివాసీ సాంప్రదయాలతో నివాళులర్పించనున్న ఆదివాసీలు
ఇంద్రవెల్లి గాయానికి నేటితో 43ఏళ్ళు .. 1981 ఏప్రిల్ 20 న జరిగిన యధార్థ ఘటన..నేడు ఇంద్రాదేవికి పూజలు చేసి అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఆదివాసీ సాంప్రదయాలతో ఆదివాసీలు నివాళులుఅర్పిస్తారు.
అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది.?
1981ఏప్రిల్ 20 ఆరోజు సోమవారం ఇంద్రవెల్లిలో వారసంత…. తమ భూములను అక్రమంగా ధనికులు బాడ బాబులు దోచుకుంటున్నారు, ఎలాగైనా తమ భూములను రక్షించుకోవాలాని రైతుకూలి సంఘంతో సభ ఏర్పాటు చెయటంతో ఈ సభను 144 సెక్షన్ పెట్టి పోలిసులు అనుమతించక పోవటంతో పోలిసులకు ఆదివాసీలకు జరిగిన తోపులాటలో ఓ పోలీసు ఆదివాసీ మహిళపై చేయివేయడంతో తనపై చేయివేసాడని తన మానాన్ని రక్షించుకోవలనుకున్న ఆ మహిళ పోలీసు పై చెయి చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న వారంతా తమ ఆదివాసీ మహిళపై చేయివేస్తారా అని కేకలు వేయడంతో వారిద్దరి మధ్య ఘర్షణ నెలకొల్పడంపై పోలీసులు లాటి చార్జ్ చేసారు. దీంతో భాయాందోళనకు గురైన ఆదివాసీలు తమ వ్యవసాయ పనిముట్లతో పోలీసులపై తిరగబడ్డారు ఈ కోణంలోనే ఆ పోలీసు మహిళ ఒంటి పై చేయి వేయడంతో ఆమె తన మానాన్ని రక్షించుకునేందుకు పొలం నుండి తన వెంట తెచ్చుకున్న కోడవలితో ఆ పోలీసును కొట్టడంతో పోలీసులు కాల్పులు జరిపారు ఇలా ఈ ఘటనలో వందలాది మంది అక్కడిక్కడే పోలిసుల కాల్పుల్లో అసువులు బాసారు..కొందరు తీవ్ర గాయాలతో బయటపడి ప్రాణాలను దక్కించుకున్నారు…. ఇందుకు నిదర్శనంగా ఈ అమరవీరుల స్తూపం నిర్మించారు….కానీ నేటికీ వారికి స్వేచ్ఛగా నివాళులర్పించటానికి అనుమతి ఇవ్వకుండా 144 సెక్షన్ పెట్టి షరతులతో కూడిన అనుమతివ్వడం సమంజసం కాదని అంటున్నారు..నేటికి భూముల సమస్యల వలయంలోనే ఉన్నారు ఆదివాసులు.