సిరా న్యూస్;
వాతావరణ మార్పులతో ఇప్పటికే భూమి అట్టుడుకుతోంది. అకాల వర్షాలు, కరవు పరిస్థితులు అల్లాడిస్తున్నాయి. వాతావరణ మార్పులు ఇప్పుడు భూ ప్రపంచానికి అనేక సవాళ్లను విసురుతున్నాయి. ఇటు భూమి పైన, అటు సముద్రాలపైనా కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ మార్పులు వల్ల వాతావరణంలో వేడిమి పెరిగి ప్రకృతి వైపరీత్యాలు జరిగే ఆస్కారం ఉంది. గ్రీన్హౌస్ వాయువుల వల్ల సమయాభావం లేకుండా కాలక్రమం మారే పరిస్థితి తలెత్తవచ్చు.అటు హిమాలయ పర్వతాలు కూడా కరిగిపోతున్నాయంటే భూతాపం ఎంతగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల కారణంగానే ఇండో గంగాటిక్ ఏర్పడ్డాయి. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాలు ఈ మైదానాల్లోనే ఉన్నాయి. అయితే…ఇప్పుడీ ప్రాంతాలన్నింటిపైనా వాతావరణ మార్పుల ప్రభావం పడుతోంది.ఐఐటీ కి చెందిన కొందరు సైంటిస్ట్‌లు ఈ హెచ్చరికలు చేశారు. ఇండస్, గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో త్వరలోనే పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదముందని చెబుతున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రతలు ఇప్పటికే ఇబ్బంది పెడుతున్నాయని, ఇది పోనుపోను అతి పెద్ద సమస్యగా మారుతుందని అంటున్నారు. అనుకోని కరవు, వడగాలులు, ఉన్నట్టుండి భారీ వర్షాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు…ఇలా ఆ ప్రభావాలు కనిపిస్తాయని వాళ్ల అధ్యయనం చెబుతోంది. జనాభా పెరుగుదల, వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు భారీ విడుదలవుతుండడం లాంటి పరిణామాలతో ఇది మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలున్నాయి. క్రమంగా ఇండస్-గంగా నదీ మైదానాల్లోని ప్రాంతాలన్నీ హాట్‌స్పాట్‌లుగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు సైంటిస్ట్‌లు. ఇప్పటికే ని హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి సవాళ్లు ఎదురైతే కష్టమే అంటున్నారు. ఈ ప్రాంతాల్లో బియ్యం, గోధుమలు ఎక్కువగా పండుతాయి. వాతావరణ మార్పులు తీవ్రమైతే ఈ పంటల దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదముంది. అయితే…ఈ సమస్యల్ని ఎదుర్కోడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సైంటిస్ట్‌లు కొన్ని సూచనలు చేస్తున్నారు. గ్రీన్ హౌస్ ఉద్గారాలు అనేవి సమస్త భూ మండలాన్ని నాశనం చేస్తాయి. ఎందుకంటే ఈ వాయువులు వాతావరణంలో వేడిని పెంచేసి వాతావరణ మార్పులను కారణమవుతున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.ముఖ్యంగా వీటి దెబ్బకు దక్షిణాది రాష్ట్రాల్లో వేడిమి పెరిగి జంతుజీవాలు విలవిలలాడుతున్నాయి. అయితే ఈ వాతావరణంలో విపరీతమైన వేడికి గల కారణాలేంటి? అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో మార్పులు ఎలా ఉంటాయి? ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? వ్యవసాయ ఉత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటాయి? అనే అంశాలపై ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ రఘు మాట్లాడారు. కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియే. మార్చి, ఏప్రిల్, మే మాసాలలో కొన్నిసార్లు జూన్‌లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వర్షాకాలం వాటిని చల్లబరుస్తుంది. కానీ సాధారణ కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు మాత్రం వాతావరణం వేడిగా ఉంటుంది. ఎడారి ప్రాంతాలు, వెచ్చటి వాతావరణం ఉండే సముద్రాలు, కొన్నిసార్లు స్థానిక పరిస్థితులతో వాటిల్లే మార్పుల ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలకు అవకాశాలు ఉంటాయి. దేశంలో పలుచోట్ల ఇప్పుడు అలాంటి పరిస్థితుల్ని చూస్తున్నాం. 10 సంవత్సరాలకు ఓసారి జరిగే వాతావరణ మార్పులు కొన్నిసార్లు మూడు సంవత్సరాలకే వస్తున్నాయి.అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో మార్పులు ఎలా ఉంటాయి?: గ్రీన్‌హౌస్ వాయువులు పెరగడం కూడా వాతావరణ మార్పులకు దారితీస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. నీటి ఆవిరి అధికం అవుతుంది. వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. గాలులు సైతం అధిక ఉష్ణోగ్రతలకు కారణం అవుతాయి. మధ్య తూర్పు దేశాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది. దాంతో అరేబియా సముద్రం వెచ్చగా ఉంటుంది. ఆ కారణాలతో మనదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి పెరుగుతోంది. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికివేస్తుండటం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమే. చెట్లను కాపాడుకోవాలి. పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలిదానివల్లే దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో ఇది వేడిని పెంచుతుంది. ఎల్ నినోతో వడగాలులకూ అవకాశం ఉంది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వంటి వాటిపై యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. విస్తృత ప్రచారమూ అవసరం. పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీలకు ముందే సమాచారం ఇవ్వాలి.సీజన్ల వారీగా వచ్చే వాతావరణ మార్పులు, వడగాలుల హెచ్చరికల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. వాటిని తెలుసుకొని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల హెచ్చరికల సమయంలో వృద్ధులను, పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు తీవ్ర ఎండల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడాలి. వడగాలుల ప్రభావానికి గురైతే ఆసుపత్రికి సకాలంలో చేర్చడం చాలా ముఖ్యం. అందుకు తగిన ఏర్పాట్లు అవసరం. అధిక వర్షాలు లేదంటే వర్షాభావ పరిస్థితులతో పంటల నష్టం జరుగుతుంది. అయితే వానాకాలంలో కురిసే వర్షం నీటిని నిల్వ చేసుకోవాలి. తద్వారా వర్షాభావ పరిస్థితులు వచ్చినా ఇబ్బంది లేకుండా నీటిని వాడుకోవచ్చని” ప్రొఫెసర్ రఘు ముర్తుగుద్దె చెప్పారు.ఉష్ణోగ్రతలు, కరవులనూ తట్టుకుని నిలబడగలిగే విత్తనాలనే చల్లడం, వరదల్ని తట్టుకునేలా డ్యామ్‌లు నిర్మించడం, వర్షాకాలంలో ఆ నీటికి పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
==================