సిరా న్యూస్,ఖానాపూర్ టౌన్
నూతన బోర్ వేయించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శ్రీ రామ్ నగర్ కాలనీ 4వ వార్డులో తాగునీరు లేక కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు .స్థానిక కౌన్సిలర్ నాయిని స్రవంతి సంతోష్ ఇటీవల ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు తెలియజేశారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్ ఎన్నో రోజుల నుండి నిరుపయోగంగా ఉన్న బోరు బావిలో నీటి మట్టంను పరిశీలించారు. మున్సిపాలిటి కార్యాలయం నుండి నూతన బోరు మోటార్ ను ఏర్పాటు చేయించి తాగు నీటిని అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయకులు జన్నరపు శంకర్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.