చంద్రబాబు జన్మదిన వేడుకలు

సిరా న్యూస్,విజయవాడ;
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో తిరుమలలోని అఖిలాండం వద్ద, ఏడు కిలోల కర్పూరం వెలిగించి, 750 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు.. శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా చంద్రబాబుకు ఉండాలని ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని సామగుట్టపల్లె వద్ద ఉన్న కదరిబండ నరసింహస్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లెలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కుప్పం తెదేపా కార్యాలయంలో ముస్లిం మైనారిటీ మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతపురం జిల్లాలోని కణేకల్లో విద్యార్థులు, టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబు కేక్ కోశారు.
=========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *