సిరా న్యూస్;
వరల్డ్ బుక్ డే లేదా వరల్డ్ బుక్ మరియు కాపీరైట్ డే, పఠనం, ప్రచురణ మరియు కాపీరైట్ ప్రోత్సహించడానికి యునెస్కో ద్వారా ప్రతి సంవత్సరం 23 ఏప్రిల్ న ప్రపంచ పుస్తకదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ లో, బుక్స్‌కి ఒక రోజు కావాలని మార్చి మొదటి గురువారం గుర్తించారు . వరల్డ్ బుక్ డే ఏప్రిల్ 1995, 23 న మొదటి సారి జరుపుకున్నారు. ఇలా ఈరోజు నే జరుపుకోవాలని ఎందుకు అనుకున్నారంటే దానికి చాలా కారణాలు వున్నాయి. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సి లాసో, వేగా అను రచయితలు 1616 ఇదే రోజున మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జన్మించడమో జరగడం విశేషం. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మది నాన్ని స్పెయిన్‌లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్‌లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్‌గా ఇస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును1995 లో యునెస్కో ‘ప్రపంచ పుస్తక దినం’ గా ప్రకటించిండమేకాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అంతర్జాలం, మీడియా కొంత వరకూ పుస్తకం మనుగడను అడ్డుకుంటున్నాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు కదా . పుట్టినరోజులకు బహుమతులుగా మంచి పుస్తకాలను ఇస్తే చాలా బాగుంటుంది. అప్పుడు పిల్లలందరు చదవటానికి బాగుంటుంది. పుస్తక పఠనం వల్ల విజ్ఞానం పొందటమే కాకుండా, మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది, మనిషిని మనిషిలా వుంచుతుంది, కోపం వచ్చినప్పుడు పుస్తకం చదివితే మనకు తెలియకుండానే కోపం పోతుంది ఇది నిజం. పుస్తకం మంచి స్నేహితుడివంటిది. ఇంకా చాలా ఉపయోగాలు వున్నాయి. అందుకే పుస్తక పఠనం చేయండి. ఇంకెందుకు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్బంగా ఈరోజు నుండే పుస్తక పఠనం మొదలుపెట్టండి. ప్రపంచ పుస్తకదినోత్సవ శుభాకాంక్షలు.