-మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి
సిరా న్యూస్,మంథని;
మంథని మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో మౌళిక సదుపాయాలను కల్పిస్తామని మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్ పల్లి లో వార్డు సందర్శనలో భాగంగా
మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి పర్యటించారు. కుచిరాజ్ పల్లి లోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వీలైనంత తొందరగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ బాబు సహకారం తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా పారిశుధ్యం కు సంబంధించిన పనులను దగ్గరుండి ఆమె పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్ నక్క నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపారావు తదితరులు పాల్గొన్నారు.
==================