గోపాల్ రావు పేట శ్రీ ప్రగతిలో ఘనంగా ప్రజ్వలన్ 24 వేడుకలు

సిరా న్యూస్,రామడుగు;
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట లోని శ్రీ ప్రగతి పాఠశాల ప్రజ్వలన్ 24 వార్షికోత్సవ వేడుకలు స్థానిక శుభం గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ హాజరై జ్యోతి ప్రజ్వలను చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం యాదగిరి శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని సూచించారు. మంచి లక్ష్యంతో ముందుకెళ్లి చదువుకోవాలని చదువుతోపాటు సంస్కారం అలవర్చుకోవాలని వారు సూచించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో పాఠశాల యాజమాన్యంతో ఉన్న కీర్తిశేషులు మండవ నాగేశ్వరరావు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. విద్యను డిజిటల్ రూపంలో మార్చేందుకు కృషి చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అన్నదానం రాధాకృష్ణ ప్రధానోపాధ్యాయులు ఆలే వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు ఎడవల్లి నరేందర్ రెడ్డి పాఠశాల డైరెక్టర్లు ఉప్పుల శ్రీనివాస్ కాసర్ల ఆనంద్ బాబు అట్ల శ్రీనివాస్ రెడ్డి ముచ్చంతల మునీందర్ రెడ్డి బేతి భూమయ్య ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
=============================xx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *