ఎమ్మెల్యే బియయ్యపు మధుసూధన్ రెడ్డి మాజీ అనుచరుడి అరోపణ
సిరా న్యూస్,శ్రీకాళహస్తి;
శ్రీకాళహస్తి ఆలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి మాజీ అనుచరుడు ప్లకార్డులతో హల్చల్ చేయడం కలకలం రేపింది.. ఆలయంలో స్వామివారికి వినియోగించే వెండి పాత్రలను గతంలో తన చేత ఎమ్మెల్యే చోరీ చేయించారని వాటిని బెంగళూరుకు చెందిన భారతీ అనే మహిళకు 10 లక్షలకు అమ్మినట్టుగా హేమచంద్ర రెడ్డి చెబుతున్నాడు.. ఆ పది లక్షల సొమ్ము తన ఎకౌంటుకే వచ్చినట్టు తాను వాటిని ఎమ్మెల్యేకి అందజేసినట్టు అంటున్నాడు.. తాను చేసిన తప్పుకు శిక్షగా ఆలయం ముందు శివయ్యను క్షమాపణ కోరుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.. ఇదే విషయమై తిరుపతి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్న అధికారులు కనీసం తనను విచారించే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నాడు… కేవలం శ్రీకాళహస్తి ఆలయ వెండి చోరీనే కాకుండా ఎమ్మెల్యే లిక్కర్ స్కామ్, భూకబ్జాలు తదితర అంశాలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని హేమచంద్ర రెడ్డి చెబుతున్నాడు… ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయం ముందు ప్లకార్డులు పెట్టుకొని ఆయన చేసిన నిరసన నియోజకవర్గంలో తీవ్ర చర్చి నియాసం గా మారింది.. తన ప్రాణాలకు ఎమ్మెల్యే నుంచి ముప్పు పొంచి ఉందని ఈ సందర్భంగా భయాందోళన వ్యక్తం చేశాడు
====================