సిరా న్యూస్,ఆదోని;
ఆదోని నియోజకవర్గం వైయస్సార్సీపి శాసనసభ అభ్యర్థిగా వై సాయి ప్రసాద్ రెడ్డి తమ నామినేషన్ పత్రాలను సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఆదోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ కు సమర్పించారు . అంతకు ముందు వైఎస్సార్సీపీ పార్టీ ఆద్వర్యంలో వైయస్సార్సీపి కార్యాలయము నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్సిపి శాసనసభ అభ్యర్థి తమ నామినేషన్ సమర్పణ సందర్భంగా వారి వెంట పెద్ద ర్యాలీ నిర్వహించారు.అనంతరం వైఎస్సార్సీపీ శాసనసభ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి కి సమర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటములు దైవదీనాలన్నారు.తను ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలుగా ఆదోని నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాల తో గెలుపొందానన్నారు. ఆదోని అభివృద్ధి కి తను అహర్నిశలు కృషి చేశానన్నారు. ప్రజలు మరోసారి ఆదరించి త్వరలో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లోతన విజయానికి ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆదరించి తనకు అండగా నిలవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చారన్నారు. ఈ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తనను ప్రజలు గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
==========