సిరా న్యూస్,ఒంగోలు;
బాపట్ల జిల్లా 216 జాతీయ రహదారిపై వేటపాలెం సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. యాక్టివా బైక్ ని లారీ ఢీ కొన్న ఘటనలో ఓ చిన్నారితో సహా మహిళ మృత్యువాత పడ్డారు.చిన్నగంజాం నుండి బాపట్ల వెళ్ళుతుండగా వేటపాలెం వద్ద వేగంగా వస్తున్న లారీ ఢీకొని చిన్నగంజాం మండలం కొత్తపాలెం కు చెందిన ముక్కు పచ్చలారని ఏడాది చిన్నారి అన్విత సుబ్బారావమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
=======================