సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
పీడీఎస్ బియ్యం పట్టివేత : ఖానాపూర్ ఎస్సై లింబాద్రి
* ముగ్గురు నిందితులు అరెస్ట్
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఖానాపూర్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం..నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వచ్చిన సమాచారం వచ్చింది. ఈ మేరకు పద్మావతి నగర్ ఖానాపూర్ టౌన్ లోని వేర్వేరు చోట్ల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ చేసి ఉంచిన సుమారు 110 సంచుల పిడిఎస్ బియ్యం (సుమారు 55 క్వింటాళ్లు) లను స్వాధీన పర్చుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ చేసి వ్యక్తులు కడమంచి లక్ష్మణ్, పాతం పోశెట్టి, గడ్డం ప్రభాకర్, వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.