Govind Naik: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి : కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి : కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్

రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం గోవింద్ నాయక్ మాట్లాడారు. దేశంలో దేశ సమైక్యతకు సమగ్రతాకు ముప్పు తెస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సూచించారు.బీజేపీ ప్రభుత్వం దేవుళ్ళ పేరిట ప్రజలను విభజిస్తూ పాలిస్తుందన్నారు. బీజేపీ మరోసారి అధికారం వస్తే రాజ్యాంగాన్ని మర్చి దాని స్థానంలో మనువాదన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ 10 ఏండ్ల కాలంలో రైతు వ్యతిరేక విధానాలను నల్లచట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తుందనివిమర్శించారు. ప్రభుత్వరంగా సంస్థలను కార్పొరేటర్లకు అప్పనంగా అప్పాజెప్పిందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను పెంచుతు ప్రజలపై భారలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారని, పేద‌లు మరింత పేద‌లుగా ఉన్నారన్నారు. దేశ సంపదను అదాని, అంబానీలకు దోచుపెడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *