సిరా న్యూస్,మేడ్చల్;
గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్ కండక్టర్ బ్యాగ్ నుంచి నగదు అపహరించిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ts 03z0322) మంగళవారం సాయంత్రం 6 గంటలకు రామాయంపేట నుండి సికింద్రాబాద్ కు బయలుదేరింది. రాత్రి 8 గంటల సమయంలో దాదాపు 90 మంది ప్రయాణికులతో బస్ మేడ్చల్ చేరుకుంది. అప్పటికే బస్ కండక్టర్ సాయికుమార్ బ్యాగ్ లో 10వేల రూపాయలు కనిపించకపోవడంతో మేడ్చల్ డిపోలో బస్ ఆపి ప్రయాణికుల తనిఖీ చేయగా ఎవరి దగ్గర నగదు లభించలేదు. దీంతో డ్రైవర్ బాబు కండక్టర్ సాయికుమార్ మేడ్చల్ పోలీసుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు