ఒట్టేసి దేవుడితో రాజకీయాలు చేసే మీరా…

సిరా న్యూస్;

బీజేపిని విమర్శించేది?

అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా…. నన్ను ఓడించేది?

బండి సంజయ్

‘‘ఇక్కడున్న కొందరు నోటి దురద ఉన్న కాంగ్రెస్ నాయకులు దేశం, ధర్మం గురించి మాట్లాడితే నాకేం పనిలేదని కించపర్చేలా మాట్లాడుతున్నరు. మరి ముఖ్యమంత్రి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేస్తరు. యాదాద్రి పోయి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు..వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. వాళ్లు మాట్లాడితే కరెక్టట. నేను మాట్లాడితే తప్పట… ఇదేం న్యాయం?. నేను వాళ్ల లెక్క దేవుడిపై ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయడం లేదు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం పోరాడుతున్న’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా నేటికీ తేల్చుకోలేని నాయకులు తనను ఓడిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.‘‘ఇక్కడున్నాయన పార్టీకి, సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్ ను తీసుకుపోయి నామినేషన్ వేయిస్తడు. ఈ విషయం తెలిసి సీఎం, హైకమాండ్ గరం అయితున్నరు. ఇయాళ పోటీగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేస్తడట.. రేపే నామినేషన్లకు ఆఖరు తేదీ. ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేకపోతున్న నేతలు నాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

ఈరోజు చొప్పదండి విచ్చేసిన బండి సంజయ్ కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు, ముదిరాజ్ సంఘం మంద శ్రీరాం ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను, కేంద్రంలోని నరేంద్రమోదీ సహకారంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివ్రుద్ధిని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని కోరుతున్నా.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఓటేసి ప్రజలు మోసపోయారు.
నరేంద్రమోదీ హామీలివ్వకుండా అధికారంలోకి వచ్చినా ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నడు. మోదీ చేసిందే చెబుతారు. చెప్పిందే చేస్తారు..

ఇక్కడున్న కొందరు నోటి దురద ఉన్న కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ దేశం, ధర్మం గురించి దేవుడి గురించి మాట్లాడితే ఆయనకేమీ ఏమీ పనిలేదు. దేశం, ధర్మమంటూ మత రాజకీయాలు చేస్తున్నాడని విమర్శిస్తారు.. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు. జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేస్తరు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు..వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. వాళ్లు మాట్లాడితే కరెక్టట. నేను మాట్లాడితే తప్పట… ఇదేం న్యాయం?

ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తారట. ఎన్నికల్లోపే ఎందుకు చేయలేదు. పోనీ ఎన్నికల కోడ్ అయిపోగానే జూన్ 4న రుణమాఫీ చేయొచ్చు కదా.. ఎందుకు చేయరు? పార్లమెంట్ ఎన్నికలైపోంగనే స్థానిక సంస్థలు కూడా నిర్వహించి ఓట్లు దండుకున్నా.. రుణమాఫీసహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేయాలని ప్రభుత్వం ప్లాన్ వేసింది. అందుకే ఈ కపట నాటకమాడుతూ దేవుడిమీద ఓట్టేసి రాజకీయం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *