సిరా న్యూస్, చిగురుమామిడి:
చిన్నముల్కనూరు వద్ద రోడ్డు ప్రమాదం..
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ వైన్స్ దగ్గర బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామానికి చెందిన బి రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో వారిని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.