సిరా న్యూస్, జైనథ్:
పార్డి–కే లో ఘనంగా అంబేడ్కర్ జయంతి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పార్డి–కే గ్రామంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను గ్రామస్తులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పంచశీల్ జెండా ఆవిష్కరించి త్రిశరణ్, పంచశీల్, అష్టగాథాలను పటించారు. అనంతరం బాబా సాహేబ్ అంబేడ్కర్, బుద్దుని చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అస్తక్ ఉజ్వల సుభాష్ మాట్లాడుతూ… బాబా సాహేబ్ అంబేడ్కర్ ప్రతీ ఒక్కరికి ఆదర్శమని అన్నారు. భారత దేశానికి రాజ్యంగాన్ని అందించిన ఆయన అందరివాడని అన్నారు. ప్రతీ ఒక్కరు ఆయన చూపిన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బుద్ధ ఉపాసక్, ఉపాసికాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.